శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
571. మైత్ర్యాది వాసనాలభ్యా | ||
వాసనా చతుష్టయము గలవారిచే పొందబడునది. మైత్రి, కరుణ, ఉపేక్ష, ముదిత అన్న నాలుగు వాసనా చతుష్టయములు వున్న వారికే దేవి అనుగ్రహము లభ్యమౌతుంది. సజ్జనులతో మైత్రి సాగించాలి, దీనార్థుల యెడల కరుణ చూపించాలి, దుర్జనుల పట్ల ఉపేక్ష వహించాలి, పుణ్యాత్ములు, ఆత్మ సాక్షాత్కారము పొందిన వారికి, ముదితముగా అనగా సంతోషముగా సేవ చేసుకోవాలి. ఈ నాలుగు లక్షణాలు వున్న వారికి దేవి యొక్క సాక్షాత్కారము లభ్యమౌతుంది 🙏 🌺అందరి పట్ల స్నేహ భావమును చూపుతాము. జ్ఞాన సంపదను పెంచుకుంటాము. 🌺 |