శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
587. కామసేవితా | ||
కామునిచే సేవింపబడునది. కామము అనగా కోర్కెలు వున్న వారిచే సేవింపబడునది. కాముడు అనగా మన్మధుడు, ఈశ్వరుడి ఆగ్రహానికి అహుతి యైనా, పరమేశ్వరి యొక్క చల్లని చూపుతో రతీ దేవి యొక్క వైధవ్యాన్ని పోగొట్టి, వారిచే నిరంతరము సేవింపబడే పరశక్తియే కామసేవితా. 'క' అనగా నిర్గుణ పరబ్రహ్మ , సృష్టికి పూర్వము. 'మ' సగుణ బ్రహ్మా సృష్టి సంకల్ప రూపమును దాల్చిన ఈశ్వరుడే, కామేశ్వరుడు. ఈశ్వరుని యొక్క శక్తి రూపమే కామసేవితా ధర్మ పాలన, సత్బుద్ధితో పరమేశ్వరిని ఆరాధించే, సేవించే భక్తులను అనుగ్రహించే దేవియే కామసేవితా 🙏 🌺 మనసా, వాచా, కర్మణా పరమేశ్వరిని ఆరాధించే వారి కోరికలను తీరుస్తుంది. 🌺 |