శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
505. స్వాధిష్టానాంబుజగతా | ||
స్వాధిష్ఠాన పద్మములో నివసించునది అష్ట దళపద్మముతో కూడి వున్నది స్వాధిష్టాన చక్రము. స్వాధిష్టాన చక్రము అగ్నితత్వము, అరిషడ్వర్గాలకు మూలమైనది. యోగ సాధనలో స్వాధిష్టాన చక్రమునందు కుంభకం చేస్తే, బ్రాహ్మగ్రంధి విస్పోటిస్తుంది. ఈ స్థితిలో సాధకుడు, మాయ అన్న అరిషడ్వర్గాలని వదలి , తాను బ్రహ్మాస్వరూపము అని తెలుసుకుంటాడు. సిద్ధేశ్వరి అన్న పేరుతో ఈశ్వరీ ప్రకాశీస్తుంది. 🙏 🌺అరిషడ్వర్గాలు మనిషికి ఆరు అంతర్గత శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి. అరిషడ్వర్గాలను జయిస్తే భగవంతుని తత్వం బోధపడుతుంది.🌺 |