శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
566. మిత్రరూపిణి | ||
సమస్త జీవకోటికి మైత్రీ రూపిణి జ్ఞానులకైనా అజ్ఞానులకైనా, శ్రీమంతులకైనా , దరిద్రులకైనా ధర్మమార్గమున నడిచే మరెవరికైనా ఆమె మైత్రి రూపిణి అంటే స్నేహితురాలు. ఆపదలో, కష్టములో, లేదా ఏదైనా సమస్యను పరిష్కరించటములో, మిత్రుని వలే ఆదుకుంటుంది. స్నేహ లక్షణములు కలిగి వున్న పరాభట్టారికాయైన లలితా పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 సహాయము అడిగినవారికి, స్నేహా సహకారములను అందించకలుగుతాము. 🌺 |