శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
580. మృణాళ మృదుదోర్లతా | ||
తామర తుడులవంటి బహువులు కలది. సుకుమారమైన, మృదువైన తామర తుడులలోని దారము వలే సుకుమారమైనా భుజములు కలది. మానవ శరీరములో సుషుమ్న నాడి స్థానమును అమ్మవారి ముఖము, ఇడ పింగళా నాడులు రెండు బహువులుగా భావన చేయాలి. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు మూడు మూలాధార చక్రంలో త్రిజటా రూపంలో అల్లుకొని ఉంటాయి. మూలాధార చక్రము నుండి బయలుదేరిన నాడులు మేరుదండం ద్వారా పైకి వెళ్ళి కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రము వద్ద కలుస్తాయి. ఇడ, పింగళ నాడులు అజ్ఞా చక్రం వద్ద ఆగుతాయి. సుషుమ్న నాడి మాత్రం అజ్ఞా చక్రము దాటి సహస్రారం వద్ద ఆగుతుంది. సూక్ష్మ తేజేసుతో త్రిజటా రూపిణియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺శరీరములో కలిగే సూక్ష్మ మార్పులకు కారణములు తెలుసుకోడానికి ప్రయత్నిస్తాము.శరీర ఆరోగ్య పట్ల శ్రద్ధ వహిస్తాము. 🌺 |