శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
522. ఆజ్ఞాచక్రాబ్జ నిలయా | ||
ఆజ్ఞాచక్ర పద్మంలో నివసించునది. మూడు నాడుల సంగమ స్థానము. భృకుటి మధ్య ఇడ, పింగళా, సుషుమ్న నాడులు ,రెండు కనుబొమల మధ్య స్థానమున కలుస్తాయి. అదియే అజ్ఞా చక్ర స్థానము. జ్ఞానానికి, వికాసానికి మూలమైన శక్తి స్వరూపిణీగా ప్రకాశిస్తుంది దేవి. 🙏 🌺ధ్యాన శక్తి కేంద్రముగా మనస్సుని భక్తీ మార్గము వైపు నియంత్రణ చేస్తుంది. 🌺 |