శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
596. హృదయస్థా | ||
హృదయము నందు నివసించి వున్నది శరీరములో చైతన్య ప్రభావాన్ని కలిపించేది, జీవాత్మ స్థానమైన హృదయస్థానము. ఈ హృదయం వద్దనే అనాహత పద్మం ఉంటుంది. దీనిని 'హృత్పుండరీకం' అన్నారు. అంటే హృదయములో పుండరీకము. పుండరీకం అంటే “పద్మం' ఈ హృత్పుండరీకం శరీరంలో ప్రధాన కేంద్రంగా ఉంటుంది. 'ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేసే హే అర్జున తిష్ఠతి' అని గీతలో తెలిపారు. ప్రతి జీవిలోను పరమేశ్వర స్వరూపముగా నివసించే దేవికి నమస్కారము 🙏 🌺బిందు రూపేణ హృదయ స్థానంలో పరమేశ్వరి రూపాన్ని ధ్యానించిన వారు, ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు . 🌺 |