శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
517. అస్థిసంస్థితా | ||
అస్థి అనగా ఎముకల, సంస్థితా అనగా నివసించి వున్నది. సప్తదాతువులలో ఒకటి ఎముక. జీవుడి యొక్క రూపురేఖలు, తను తిన్న ఆహారము పౌష్టికతనుబట్టి ఎముకలలో దృఢత్వము ఏర్పడుతుంది , తద్వారా శరీర పరిణామక్రమానికి తోడ్పడుతుంది. మూలాధార చక్రమునకు అధిష్టాత్రీ సిద్దవిద్య దేవి యొక్క శక్తి, ఎముకలకు రక్షణ కలిగిస్తుంది. 🙏 🌺ఎముకలకు సంబంధించిన వ్యాధి నివారణ చూపిస్తుంది. అస్థిసంస్థితాయై నమః అని నామ జపం ఉచ్ఛరిస్తూ తీర్థం తీసుకొంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. 🌺 |