శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
545. పుణ్యశ్రవణ కీర్తనా | ||
దేవి నామము శ్రవణము చేసినా, కీర్తన పాడినా పుణ్యము. పుణ్యప్రదమైన దేవిభాగవత పురాణములు, నామ పారాయణములు, కీర్తనములు స్తుతించినా లేదా వినటము చేసినా , అపారమైనా పుణ్యమును ప్రసాదిస్తుంది. భక్తీ శ్రద్ధలతో అమ్మవారియొక్క రూపమును ధ్యానించి, నామ పారాయణము చేస్తే, జగదంబ మనయందు కరుణా వాత్సల్యమును కురుపిస్తుంది🙏 🌺దేవి మహాత్వములను తెలుసుకుంటాము. సత్సంగములో వున్న వారికి, తన సేవ చేసుకొనే భాగ్యము కలిగిస్తుంది 🌺 |