శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
538. అమతి: | ||
బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి. అనుపాస్య స్థితికి అతీతమైనది. అంటే దేవి యొక్క నామస్మరణ తో కలిగే వాక్కు, మనస్సుతో ఆరాధించే దేవియొక్క రూపము కంటే అతీతమైనది అని అర్ధం. అప్రయత్నముగా ధర్మ మార్గమున నడవడం అన్నది బుద్ధి వికసించడం బుద్ధి ప్రేరణ చేయు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺బుద్ధి వికాసము, ప్రజ్ఞను ఈ నామ జపం ద్వారా పొందుతాము 🌺 |