శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
553. సర్వమృత్యు నివారిణీ | ||
మృత్యు భయమును పోగొట్టు శక్తి స్వరూపము భవరోగము మృత్యువునకు దారితీస్తుంది. ప్రతి మనిషికి జననం, మరణం సహజం. మనిషి మనస్సు 'స్వ' భావన విడనాడి 'పరా' భావమును నింపిన నాడు, మృత్యు సమయమున, ఆత్మ పరమాత్మయందే లయమౌతుంది. మృత్యువు గురించి భయము తొలగిపోతుంది. సర్వ కాలమునందు, పరాశక్తి నామము స్మరించిన యెడల, అకాల మృత్యువు, ఆపదలను తొలగిస్తుంది🙏 🌺అకాల మృత్యువుని తొలగిస్తుంది. క్షేమకరమైన, శుభకరమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది.🌺 |