శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
507. శూలాద్యాయుధ సంపన్న | ||
శూలము ఇత్యాది ఆయుధములతో విరాజిల్లునది. నాలుగు ముఖములు కలిగి వున్న సిధ్ధేశ్వరి దేవీ, నాలుగు ఆయుధాలను కూడా ధరించినది. అవి త్రిశూలము, పాశము, కపాలము, అభయముద్రలతో విరాజిల్లుతోంది. సత్యం, ధర్మం, న్యాయం, నీతి తదితర దైవీ గుణాలను పెంపొందించేందుకు; కామ, క్రోధ, ఈర్ష్య, రాగ, ద్వేషాలైన రాక్షస గుణాలు తొలగించేందుకు ఆయుధములను ధరించినది పరమేశ్వరీ. 🙏 🌺భక్తులను పీడించే దుష్టశక్తులను, భయములను పారద్రోలి, అభయాన్ని ప్రసాదిస్తుంది పరమేశ్వరీ 🌺 |