శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
589. త్రికుటా | ||
పంచదశీ విద్యా స్వరూపిణి సృష్టి, స్థితి, లయ అన్న మూడు కూటముల రూపిణి. పరా,పశ్యంతి, మధ్యమా, వైఖరీ స్వరూపిణి. వాకశ్వరూపిణి సరస్వతి దేవియే త్రికుటా. జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థా స్వరూపిణి. పంచదశీ విద్యా స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺మనలోని ఆలోచన, వ్యక్త పరచడము, క్రియా అన్ని ఒకే రీతిగా వుండాలి అని ప్రయత్న పూరితముగా సాధన చేస్తాము. 🌺 |