శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
579. మహాకైలాసనిలయా | ||
శ్రీచక్ర బిందు నిలయా కైలాసమందు శివపార్వతి నివాస స్థానము. శ్రీచక్ర బిందువు స్థానమే మహాకైలాసము. మానవ శరీరమందు షట్ చక్రములలో సహస్రారం కైలాసం. కైలాసం అంటే ఆనందం లాస్యం చేసే చోటు.మనిషి సహస్రార మునకు చేరినప్పుడు సహస్రపద్మ దళములో నివసించి వున్న శివశక్తి స్వరూపమును చూసి అమితానందమును పొందుతాడు. ఆనంద స్వరూపిణిగా దర్శనమిచ్చే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺కష్టములో వున్న వారిని ఆదుకున్నప్పుడు, వారిలో చూసే క్షణికమైన ఆనందమే కైలాసము 🌺 |