శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
525. మజ్జాసంస్థా | ||
మజ్జా ధాతువును ఆశ్రయించి వున్నది ఎముకలలో వున్నటువంటి మజ్జా దాతువుని ఆశ్రయించి వున్నది. శరీరములో గుజ్జు వంటి పదార్థము మజ్జా. ఈ దాతువు వల్ల నేత్రములు మూయుట,తెరుచుట, నోటీలో లాలజలము, శ్వాసను నియంత్రించుట వంటివి సాధ్య పడుతాయి. దేహములో జీవశక్తిని ప్రసాదించే తల్లి మజ్జాసంస్థా 🙏 🌺 ధైర్యము, ఉత్సాహము, ధర్మకార్య సిద్ధి కొరకు పట్టుదల వంటి సద్గుణములను కలిగిస్తుంది. సత్కర్మలు, సదాలోచన వైపు ప్రోత్సహిస్తుంది.🌺 |