శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
557. కాత్యాయనీ | ||
కతు మహర్షి కూతురుగా జన్మించినది కాత్యాయని అంటే తేజ స్వరూపిణి. తేజస్సు అంటే జ్ఞానం. అమ్మవారు జ్ఞానదాయిని. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను సంసార జలధి అనే భవసాగరము నుండి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థకామమోక్షాలకు అధికారిణియైన పరాశక్తి అంశయైన కాత్యాయనీ దేవికి నమస్కారము 🙏 🌺యోగశాస్త్రం ప్రకారం కాత్యాయని ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవతగా చెప్తారు. ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మవారు.🌺 |