శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
576. మాధ్వీపానాలసా | ||
మధువు సేవించుట యందు మైమరచివున్నది పద్మముయందు వున్న మకరందమును తుమ్మెద ఎలాయైతే మైమరచి సేవిస్తుందో. అటులనే సాధకుడు సహస్రారము చేరి పరమాత్మ దర్శనముతో కలిగే అమృతానంద స్థితియే మాధ్వీపానాలసా. తేన వంటి తీపి స్మృతిలో దాగి వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺పరమేశ్వరీ తన భక్తులకు కలిగించే అనుభవాలు తేన వలే తీపి స్మృతులు 🌺 |