శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
504. లాకిన్యంబా స్వరూపిణీ | ||
లాకినీ దేవతా స్వరూపము మణిపూరచక్రమునకు అధిష్టాన దేవీ యొక్క పేరు లాకిని. అన్నసారమును సప్త దాతువులుగా మార్చే దేవీయే లాకిన్యంబా 🙏. 🌺సప్త ధాతువుల యొక్క సంరక్షణ, మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దేవీ యొక్క నామ జపము ద్వారా, మనిషి తన జాతకం లోని ఆయా దశలను, చెడు సమయాలను ముందుగానే గుర్తించి, జాగ్రత్తలు తీసుకోగలరు. ఆపదలనుంచి కాపాడుతుంది. ఎముకలు సూర్యుని అధీనంలో, రక్తం చంద్రుని అధీనంలో, మజ్జ కుజుని అధీనంలో, చర్మము బుధుని అధీనం , కొవ్వు గురుని అధీనం, శుక్రం శుక్రుని అధీనం, కండరాలు శని అధీనం.🌺 |