శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
532. శుక్ల సంస్థితా* | ||
శుక్ల దాతువుని ఆశ్రయించి వున్నది సప్తదాతువులలో శుక్ల దాతువు జీవుని యొక్క శరీరమంతయు, వ్యాపించి సంరక్షిస్తుంది. శుక్ల వర్ణముతో కూడి వున్న దాతువుని ఆశ్రయించివున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺జీవునియొక్క దేహమునందు ప్రవహిస్తూ, సమస్త నాడి సముదాయమునకు రక్షణ కలిగిస్తుంది. 🌺 |