శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
583. మహసామ్రాజ్యశాలినీ | ||
సప్త లోకములకు అధిష్టాత్రి శ్రీచక్ర బిందువే మహసామ్రాజ్యశాలినీ. మానవ శరీరములో సహస్రారము నందు పరంజ్యోతి పరమేశ్వరీయే మహసామ్రాజ్యశాలినీ. మానవుని బుద్ధిని, మనస్సు యొక్క కోర్కెలను నియంత్రించి మోక్ష మార్గమున నడిపించే జ్ఞానమే మహసామ్రాజ్యశాలినీ 🙏 🌺మన జీవితాన్ని సన్మార్గము వైపు నడిపించే జ్ఞానమును ప్రసాదిస్తుంది. 🌺 |