శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
514. కాకిని రూపధారిణి | ||
*514 కాకిని రూపధారిణి* కాకిని దేవత రూపమును ధరించినది స్వాధిష్టాన చక్రమునకు కాకిని పేరు గల దేవతరూపము ధరించినది. అలాగే ఈ చక్రమునకు అధిపతి శుక్రుడు. మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగు అన్నం ప్రీతి🙏 🌺కరుణ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, మైత్రి లాంటి సద్గుణములను అలవర్చుకోగలుగుతాము. తమ భావాలు మరొకరికి భారం కాకుండా, బాధ కల్గించకుండా చూసుకోవడం లాంటివి ఆచరించగలిగితే ,స్వాధిష్టాన చక్రము జాగృతి అవుతుంది.🌺 |