శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
581. మహనీయా | ||
మహనీయురాలు అందరిచే ఆరాధించ తగినది. సృష్టి లో అన్నింటికంటే అతీ ఉత్తమమైనది, శక్తివంతమైనది. అనంత స్వరూపిణియైన పరమేశ్వరీయే మహనీయా. రూపములో, గుణములో, విద్యలో అన్నింటా మహనీయురాలు కాబట్టి పరమేశ్వరీ మహనీయా. ధ్యాన స్థితి యందు సహస్రారమునకు చేరుకున్న సాధకులు మహనీయులు. వారిలో పరమేశ్వరీ రూపము ప్రకాశిస్తూ కనబడుతుంది.🙏 🌺ఉత్తమమైన లక్షణములు కలిగివున్నవారు మహనీయులు. 🌺 |