శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
563. మోహినీ | ||
తన యందు మోహము కలుగుజేయునట్టి శక్తి స్వరూపిణి మాయా, మోహములు, ప్రతి యొక్క మనిషిని బాధించేవే. స్వార్థం అన్న ఒక్క లక్షణము సర్వ నాశనానికి దారి. స్వార్ధం అన్న మాయా పొరను తొలగించి, సర్వ ప్రాణ కోటిలో పరాశక్తి రూపమును దర్శించగలిగే బుద్ధి, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ధర్మ మార్గమున నడిచే వారిని అడ్డగించే దుష్ట భావములైన రాక్షసులను తొలగించటానికి మోహిని రూపమును దాల్చి, తన భక్తులైన దేవతలకు అమృతాన్ని ప్రసాదిస్తుంది. 🙏 🌺ఇతర స్వార్థ పూరితమైన విషయాలు పట్ల మోహములో పడకుండా,మనా, తనా అన్న భేదము లేకుండా సమాజ శ్రేయస్సును కోరుతాము . 🌺 |