శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
503. సమస్త భక్త సుఖదా | ||
భక్తులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. శ్రద్ధా భక్తీ వున్న చోట, సంపూర్ణ ఫలితము దక్కుతుంది. శ్రద్ధ వున్న చోట భక్తి లేకున్నా, అదే విధంగా భక్తి వున్న చోట శ్రద్ధ లేకున్నా శూన్య ఫలితము లభిస్తుంది. భక్తులకు, పరమేశ్వరీ యందు పరిపూర్ణమైన విశ్వాసం మరియు శ్రద్ధా భక్తీ వున్నవారికి, తప్పకుండా సమస్త సుఖములను ప్రసాదిస్తుంది🙏 🌺ఎంతటి కష్ట కాలము వున్నా, పరమేశ్వరీని పరిపూర్ణమైన విశ్వాసముతో,శ్రద్ధా భక్తితో పూజించినవారికి సకల సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. 🌺 |