శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
575. ప్రజ్ఞానఘన రూపిణీ | ||
విశేషమైన జ్ఞాన సంపదను కలిగివున్నది. ఆత్మ పరమాత్మ రెండింటిని ఒకటి చేయడమే ప్రజ్ఞానం. మనలో వుండే మూలకారణమైన శక్తిని ప్రజ్ఞానఘన అని అంటారు. ఆత్మ తత్వాన్ని బోధించే శ్రీ లలితా పరమేశ్వరీయే ప్రజ్ఞానఘన రూపిణి. మాయ అనే అజ్ఞానమును తొలగించుకోవడమే జ్ఞానము. జ్ఞానమును పరమాత్మ యందు లయము చేయడమే ప్రజ్ఞానము. ప్రజ్ఞానఘన రూపములో వున్న తల్లికి నమస్కారము 🙏 🌺అజ్ఞాన, జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన అన్న నాలుగు మెట్లు ఒకటొకటిగా తెలుసుకొని దాటగలిగే స్థితిని పొందగలుగుతాము 🌺 |