శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
598. త్రికోణాoతరదీపికా | ||
శ్రీ చక్రాంతర బిందు స్వరూపిణి. సృష్టి సర్వము అగ్ని, సూర్య, చంద్ర మూడు వెలుగుల చేత ఏర్పడినది . మన శరీరమును శ్రీచక్రముగా భావించాలి. అందులో మూలాధార - స్వాధిష్టానములు అగ్ని మండలములు, మణిపూర -అనాహతము సూర్య మండలము, విశుద్ధ - అజ్ఞా చంద్ర మండలములు. ఈ మూడు త్రికోణములు హృదయస్థానము బిందువు. అక్కడ ఆత్మ స్వరూపముగా పరాశక్తి కోలువై వుంటుంది. లలితా త్రిపుర సుందరియే అనంత త్రిశక్తి స్వరూపిణి 🙏 🌺 బుద్ధి, మనసు, క్రియా మూడు ధర్మ మార్గమునే సూచిస్తాయి 🌺 |