శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
540. శృతి: | ||
వేద రూపిణి. వినడం వల్ల నేర్చుకున్న వేద స్వరూపము శృతి: గురువు, వేదమంత్రములు , సంగీతము, పురాణము, ఉపనిషత్తులు చెప్పగా, శిష్యుడు నోటితో వల్లె వెయ్యగా, జ్ఞాపకము పెట్టుకొని, మరల పాఠం అప్పచెప్పి కంఠస్థము చేయటము అన్నది శృతి. వేద రూపిణిగా మానవుడికి శృతి శక్తిని ప్రసాదించే తల్లికి నమస్కారము 🙏 🌺వినడము అన్నది ఓర్పుతో, నేర్పుతో కూడిన పని మరియు ఒక కళ. దానికి కావలసిన చైతన్య శక్తిని ప్రసాధిస్తుంది 🌺 |