శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
586. శ్రీవిద్యా | ||
శ్రీవిద్యా మంత్ర స్వరూపిణి పరమేశ్వరి తన యొక్క ఆరాధన శ్రీచక్ర, శ్రీవిద్యా మరియు శ్రీ లలితా నామములతో ప్రీతి చెందుతుంది. శ్రీవిద్యా ఆరాధన నిష్టతో, భక్తి శ్రద్దలతో కూడినది. 'శ్రీ' అనగా శుభమును ఇచ్చేది. 'విద్య' అనగా జ్ఞానము. శుభఫలితాన్ని ఇచ్చే జ్ఞానమే శ్రీవిద్యా. శ్రీవిద్యయే లలితా త్రిపురసుందరి. జ్ఞానమును ప్రసాదించే తల్లి అని అర్థం🙏 🌺జ్ఞాన సంపదను, లోకహితము కొరకే ఉపయోగిస్తాము. పరమేశ్వరీ యొక్క ఆశీస్సులను పొందుతాము.🌺 |