శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
578. మాతృకావర్ణ రూపిణీ | ||
మాతృకా వర్ణ స్వరూపిణి అన్ని అక్షరములకు పరమేశ్వరీయే అధిష్టాత్రి. అన్ని వర్ణములు, రంగులు పరమేశ్వరియొక్క తేజేసుతో కూడినవే. సర్వ వర్ణములలో మొట్ట మొదటి అక్షరము అయిన “అకారము” శివుడు, . అంత్యాక్షరమైన “హకారము” శక్తి, . వీటి సామరస్యమే పరమేశ్వరియొక్క ఓంకార నాదము. అన్ని మాతృకావర్ణములు పుట్టినవి , ఓం కారము నుండే, అందుకే ఆ సర్వమంగళ మాతృకావర్ణ రూపిణి అయినది 🙏 🌺మాతృకావర్ణములు స్పష్టంగా పలకడం వల్ల, మనిషి యొక్క కుండలిని శక్తిని జాగృత పరుస్తుంది. 🌺 |