శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
534. సర్వౌదన ప్రీత చిత్తా | ||
అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించునది. జీవులయొక్క ఆకలిని, కోరికలను తీర్చే తల్లి. అన్నము పరబ్రహ్మ స్వరూపము అన్న భావనతో అన్నమును పారేయకండి. నిర్లక్ష్యము చేయకండి. సమృద్దిగా భోజనము పెట్టండి. వివిధ రకములైన ఆహారములు పరమ భక్తితో అమ్మవారికి సమర్పించినచో ఆనందముతో స్వీకరిస్తుంది పరమేశ్వరీ. అన్నాన్ని ఆశ్రయించి వున్న తల్లికి నమస్కారము 🙏 🌺అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరాశక్తిని అర్చించు భక్తులకు ఆ తల్లి కరుణచే అన్నవస్త్రములకు లోటువుండదు. 🌺 |