శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
546. పులోమజార్చితా | ||
పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది. శచీదేవి ఇంద్రుని భార్య. పులోమ మహర్షి కూతురైన శచీదేవి, తన భర్త ఇంద్ర పదవిని పోగొట్టుకున్నప్పుడు, త్రిపుర సుందరి దేవిని ఆరాధించినది. దేవి సంతుష్టి చెంది ఇంద్రునకు ఇంద్ర పదవి మరల ప్రసాదించినది. తన భక్తుల క్షేమము కోరే దేవికి నమస్కారము 🙏 🌺తనని భక్తితో ఆరాధించిన వాళ్ల యోగ క్షేమాన్ని చూసుకుంటుంది. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. 🌺 |