శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
508. పీతవర్ణా | ||
పసుపు పచ్చ, బంగారు వర్ణము కలది స్వాదిష్టాన చక్రమునకు అధిష్టాత్రీయైన సిధ్ధేశ్వరి దేవీ, బంగారు పసుపు రంగు కాంతి వర్ణము కలిగి వున్నది. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారము 🙏 🌺ఆరోగ్యమైన జీవన విధానాన్ని తెలుసుకొని, ఆచరిస్తాము.ఆరోగ్యమే మహాభాగ్యము 🌺 |