శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
568. భక్తనిధి | ||
తన భక్తుల పాలిట పెన్నిధి. భక్తుల కోర్కెలను తీర్చినను , కరగని నిధి కలిగి వున్నది. పరాశక్తి పట్ల భక్తి విశ్వాసము మరియు నమ్మకము తో ప్రార్దించే వారికి వారి కోరికలను తప్పకుండా తీరుస్తుంది. మన ప్రారబ్దమును బట్టి కోరికలు తీరుతాయి. కోరికలు తీరనిచో, పరాశక్తి యందు భక్తి విశ్వాసము తరగకూడదు. తల్లి మీద అపారమైనా విశ్వాసము ఉంచాలి. నిరుత్సాహ పడకూడదు. సమయానుకూలాన్ని బట్టి భక్తుల పాలిట పెన్నిధిగా, నిధిని ప్రసాదిస్తుంది🙏 🌺ధర్మ మార్గమున నడిచే వారికి పుణ్యము అన్న నిధి ద్వారా పరమేశ్వరికి ప్రీతిపాత్రులము అవుతాము 🌺 |