శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
565. మృడానీ | ||
మృడుని యొక్క భార్య. మృడుడైన శంకరుని యొక్క భార్య. సత్వగుణములు కలిగివున్న మృడిని భార్య. అందరిని ఆదరణతో చూసే గుణమును కలిగి వుండటం మృడత్వం. అలా కలిగి వున్న మానవుడు, ఈశ్వరుడితో సమానము. ఇటువంటి సత్వ గుణములను కలిగిన వారు చేపట్టే సంకల్పాలు నెరవేర్చే శక్తిని ప్రసాదిస్తుంది. శక్తి రూపములో వున్న ఈశ్వరుని భార్యయే మృడానీ🙏 🌺దేవి యొక్క నామజపముతో సత్వ గుణములతో కలిగే సంకల్పములు సిద్ధిస్తాయి. 🌺 |