శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
510. మేదోనిష్ఠా | ||
మేధస్సుయందు నివసించివున్నది జీవుడియొక్క మేధస్సులో కొలువై వుంటుంది. జీవుడు గత జన్మముల పాప పుణ్యాలను బట్టి కొంతమంది జ్ఞానులుగా లేదా మందబుద్దులుగా పుడతారు. అలాగే మనిషి యొక్క ఆలోచనలు వారి పాపకర్మలను బట్టి సన్మార్గమున లేదా చెడు మార్గమున నడిపిస్తుంది. మేదో ధాతువుకి దేవత సిధ్ధేశ్వరి. జీవుడియొక్క మేధస్సులో కొలివై వున్న తల్లికి నమస్కారము 🙏 🌺 సద్భుద్ది, సత్ ప్రవర్తన కలిగి వుండాలి, మన నిత్య జీవన విధానము అంతా ధర్మ మార్గములోనే నడవాలీ అని దేవీని ప్రార్ధించాలి 🌺 |