శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
502. గుడాన్న ప్రీతమానసా | ||
గుడాన్నమును ఇష్టపడునది. అన్నము జీర్ణమైన తరువాత అన్నసారము రక్త, మాంస ధాతువులుగా మారుతాయి అని క్రిందటి నామములో తెలుసుకున్నాము. గుడాన్నము అనగా అన్నములో బెల్లముకలిపి వొండిన తీపి పదార్ధము. మనసు మధురముగా వున్న తల్లికి గుడాన్నము ప్రీతి. బెల్లములో ఇనుము పదార్థము వుంటుంది. రక్త వృద్ధికి, మాంస వృద్ధికి తోడ్పడుతుంది. అన్నము పరబ్రహ్మ స్వరూపము. దేవీ కి నైవేద్యము పెట్టాక, మౌనంగా లేదా భగవన్నామ స్మరణ చేస్తూ తినాలి. అప్పుడే శారీరిక పుష్టి కలుగుతుంది. 🌺మానసిక, శారీరిక బలం లభిస్తుంది 🌺 |