శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
527. హరిద్రాన్నైకరసికా | ||
పసుపుతో కలిపిన అన్నాన్ని ఇష్టపడుతుంది పసుపు పవిత్రతకు, శుభానికి సంకేతం. పసుపు మనిషి యొక్క దేహానికి చాలా అవసరము. అన్నములో పసుపు కలపడం వల్లన భోజనము పరిశుభ్రమౌతుంది. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన భోజనము దేవికి ప్రీతి అని ఈ నామములో అంతరార్ధం. తన భక్తులు ఆరోగ్యంగా, పవిత్రమైన ఆలోచనలు కలిగి వుండాలి, అని దేవి యొక్క సందేశము ఈ నామము ద్వారా తెలుసుకోవాలి 🙏 🌺పసుపు వాడటం వల్లన రోగనిరోధక శక్తి పెరుగుతుంది🌺 |