శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
530. సర్వవర్ణోప శోభితా | ||
అన్ని రంగులతో శోభిల్లునది. సకల మంత్రములు , అక్షరములు, సర్వ రాగములు, అన్ని రకాల రంగులతో శోభాయమానముగా కనబడుతుంది. తెలుపునుండి అన్ని రంగులు పుట్టినవి, కాబట్టి సరస్వతి స్వరూపిణిగా సాధకుడిని కటాక్షిస్తుంది. సృష్టిలో వున్న సర్వ రంగులు, ఆ పరమేశ్వరీ యొక్క చల్లని చూపు ద్వారా ఉద్భవించాయి, అందుకే తల్లి సర్వవర్ణోప శోభితా అని కీర్తింప బడుతుంది. 🙏 🌺అన్నింటా దేవి యొక్క చైతన్య శక్తి దాగి వున్నది. సత్ కర్మములను ఆచరించడం వల్ల, శక్తి కేంద్రము రెట్టింపు శక్తిని మనకి ప్రసాదించి, పుణ్య కర్మములను ఆచరింపచేస్తుంది 🌺 |