శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
584. ఆత్మవిద్యా | ||
ఆత్మకు సంబంధించిన విద్య తనను తాను తెలుసుకోవడమే ఆత్మ విద్య. శరీరము శాశ్వతము కాదు. శరీరము మైల, అంటూ వంటి అశుద్ధములతో నిండి వుంటుంది. నిత్యము స్నానము, అనుష్టాణములతో శుద్ధి చేసుకోవాలి. ఆత్మ శాశ్వతము, ఎప్పుడు పవిత్రముగానే వుంటుంది . ఆత్మ సాక్షాత్కారము అంటే పరమాత్మ యందు లయము కావటమే. మనలో వుండే పరమాత్మను తెలుసుకోవడమే ఆత్మవిద్యా. మనలో వుండే పరాశక్తియే ఆత్మవిద్యా 🙏 🌺నిత్యము బాహ్య అంతర్గత విషయాలను విశ్లేషహించుకొనే గుణాన్ని అలవాటుచేసుకుంటాము. 🌺 |