శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
548. బంధురాలకా | ||
అందమైన చిక్కనైన ముంగురులు కలది. అమ్మవారియొక్క సౌందర్యమును వర్ణించుటయే ఈ నామము యొక్క తాత్పర్యము. తల్లి యొక్క కేశములు/ ముంగురులు సముద్రములో ఉన్నతమైన అలలను పోలి వున్నవి. సౌందర్యానికి రూపము దాల్చిన తల్లికి నమస్కారము 🙏 🌺బంధముల వల్ల కలిగిన చికాకుల నుండి విముక్తి కలిగించి, మనస్సుకి ప్రశాంతతను ఇస్తుంది. 🌺 |