శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
541. స్మృతి: | ||
*541. స్మరించుట. స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది అని అర్థం. వేదాల్నీ, ఉపనిషత్తుల్నీ శ్రుతులు అంటారు. ఋషులు తపస్సు చేసి గ్రహించిన సత్యాలు, శిష్యులకు వారి స్మృతి నుండీ వినిపించిన విషయాలు ఆ ఋషుల రూపములో ఉన్న ఉపనిషత్త్ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺తన భక్తుని జ్ఞాపకశక్తి మెరుగు పరుస్తుంది 🌺 |