శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
595. ఇంద్ర ధను:ప్రభా | ||
ఇంద్ర ధనస్సు వలే అనేక వర్ణములకాంతితో ప్రకాశించునది కుండలిని సాధనలో ఏడు చక్రాలు, ఏడురంగుల కాంతి లాంటివి. సాధకుడు అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాల నుండి విముక్తి పొంది, ఏడవ చక్రము సహస్రారము చేరుటకు చిట్ట చివరి ప్రస్థానమే ఇంద్ర ధను:ప్రభా. ఇంద్రియ నిగ్రహముతో అహాన్ని జయించి ,ఇంద్ర ధనస్సు వలే ప్రకాశించే పమేశ్వరికి నమస్కారము 🙏 🌺ఎకాగ్రత కుదురుతుంది. జ్ఞాన సంపద పెరుగుతుంది 🌺 |