శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
506. చతుర్వక్త్ర మనోహరా | ||
నాలుగు ముఖములతో అత్యంత సౌందర్యముగా కనపడుతుంది స్వాధిష్టాన చక్రమునకు అధిష్టాత్రీ సిద్ధేశ్వరి దేవి. ఆమె నాలుగు ముఖములతో కనబడుతుంది. నాలుగు ముఖములు అనగా చతుర్విధ పురుషార్థాలు ధర్మ, అర్ధ, కామ, మోక్షములు. నాలుగు పురుషార్థాలను, మరియు అనిమాది అష్ట సిద్దులను సాధించుటకు, సిద్ధేశ్వరి దేవి తన భక్తులను అనుగ్రహిస్తుంది. 🙏 🌺సాధనతో దేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది. 🌺 |