శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
511. మధుప్రీతా | ||
మధు యందు ప్రీతి కలిగి వున్నది తేనె వంటి తీపి పదార్థాలను ఇష్టపడునది. తేనె సకల వ్యాధులకు నివారణోపాయం. మేధస్సుకి చైతన్యాన్ని కల్పించే మధుని ఇష్టపడుతుంది. తేనెను స్వీకరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే అంతరార్థంతో ఆ తల్లిని మధుప్రీతా అని అర్చించాలి. 🌺తేనె ఒక శక్తివంతమైన ఆహారం. తేనె వలే మన జీవితములో మధురానుభూతులను కలిగిస్తుంది. మనలో చైతన్య శక్తిని ప్రసాదిస్తుంది 🌺 |