శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
591. కటాక్షకింకరీభూత కమలాకోటిసేవితా | ||
కోటి భక్త జన కటాక్షిణీ అమ్మవారి క్రీగంటి చుపుకై ఎదురుచుస్తున్న భక్తుల యెడల వాత్సల్య భరితమైన చూపులను కురుపిస్తుంది. శ్రీ చక్ర ప్రతి యొక్క కోణము లక్ష్మి స్వరూపము . వారిచే సేవింపబడుతుంది పరమేశ్వరీ. అమ్మవారియొక్క చూపు కొణములో దాగి వున్న లక్ష్మిస్వరూపము, కోటి కాంతిరేఖలవలే సప్త మండలముపై ప్రకాశీస్తుంది. కమలదళములో నివసించే లక్ష్మి స్వరూపముచే సేవింపబడే సౌభాగ్య లక్ష్మికి నమస్కారము 🙏 🌺సర్వ సౌభాగ్యాలను, సంపదలను, భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది🌺 |