శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
537. స్వధా | ||
పితృదేవతలకు సమర్పించిన కవ్యమును స్వీకరిస్తుంది. శ్రాద్ధమంత్రాల చివర ‘స్వధా’ అని చేర్చాలి. పితృదేవతలపట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధా చాలా ప్రమాదం. దేవతా పూజనైనా మానవచ్చునేమో కానీ, పితృదేవతల ఆరాధన విడువరాదు. పితృదేవతలు అంటే, తండ్రి, తాత, ముత్తాతలే కారు. దేవతా గణాలవలె పితృదేవతలు 33 గణాలుగా ఉంటారు. మనం చేసే కర్మలను చూసి పితృదేవతలు ఆనందిస్తారు. పితృలోకములో వున్న దేవతలు తరించుటకు స్వదా రూపము దాల్చిన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺సకల శుభాలు సిద్ధిస్తాయి.🌺 |