శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
552. సర్వవ్యాధి ప్రశమనీ | ||
భవరోగాన్ని ఉపశమింపచేసేది మనిషి , ఊహ తెలిసినప్పటినుంచి 'స్వ' అనే వ్యాధి అనగా స్వార్ధము, స్వపర భేదమునకు పిడితులు. 'స్వ'అన్న మాయా భావనయే సర్వ వ్యాధులకు మూలకారణము. వ్యాధులు కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. మానసిక వ్యాధి కనపడదు. మనిషి శరీరాన్ని క్రుంగదీస్తుంది. రాగ, ద్వేషములు మానసిక వ్యాధి. వీటికి మాయా అనే సర్వ వ్యాధి రూపము దాల్చి మనిషిని పిడిస్తుంది. పరాశక్తి యొక్క కరుణతో మాయా అనే స్వరవ్యాధిని ఉపశమింపచేస్తుంది 🙏 🌺మానసిక వ్యాధుల దరినుంచి కాపాడమని పరాశక్తిని వేడుకుందాము. 🌺 |