శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
559. కమలాక్ష నిషేవితా | ||
విష్ణుమూర్తిచే సేవింపబడునది. కమలాక్ష అనగా పద్మముల వంటి కన్నులు. అటువంటి కనులు కలిగిన ,శ్రీ మహావిష్ణువు చేత పూజింపబడిన శక్తి స్వరూపిణి. జగన్మాత అంశమే త్రిమూర్తులలో విష్ణు రూపము . తల్లినుండే రూపము పొంది, రూపముకి ప్రాణము ఇచ్చి , సృష్టి జరుపుటకు శక్తినిచ్చిన జగన్మాతను నిరంతరము ధ్యానించే విష్ణు రూపము. కోరిన కోర్కెలను తీర్చే వరదాయిని అని ఈ నామము యొక్క విశ్లేషణ.🙏 🌺విష్ణు తత్త్వమును పొందిన ప్రతి భక్తునికి కొంగుబంగారము చేస్తుంది. 🌺 |