శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
526. హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా | ||
హంసవతీ మొదలైన ముఖ్య శక్తులతో కూడివున్నది. షట్ చక్రాలకు ఆధిపత్యం వహిస్తూ, దేహములో ఉచ్చ్వాస నిశ్వాసకు శక్తి కేంద్రమైన అజ్ఞా చక్రదేవియైన సిద్ధమాత కు హంసవతి, క్షమా 'హ క్ష ' అన్న ముఖ్య బీజ శక్తి పరివార దేవతలు కూడివుంటారు . సాధకులు ధ్యాన స్థితిలో పరమానంద సుఖమునకు చేరుకున్నపుడు హంస, పరమహంస అని సంభోదించబడతారు. ప్రాణ శక్తి స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 తన భక్తుల యొక్క ఆరోగ్యాన్ని ,ప్రాణ శక్తి స్వరూపిణీ రక్షణ కలిగిస్తుంది🌺 |