శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
550. విద్యా | ||
జ్ఞాన స్వరూపిణి జ్ఞానమును కలిగించునటువంటి స్వరూపురాలు. బ్రహ్మా విద్యయే నిజమైన విద్య. బీజాక్షరము వెనుకవున్న పరతత్వమును తెలుసుకునుటకు ప్రయత్నముచేసే వారు బ్రహ్మావిద్య సాధకులు . అదియే అసలైన విద్య, బ్రహ్మా విద్య. అజ్ఞానమును తొలగించి జ్ఞానమును ప్రసాదించే విద్య. అటువంటి విద్యా స్వరూపిణియైన తల్లికి నమస్కారము 🙏 🌺ప్రతి మనిషికి పరమేశ్వరి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తన కర్మ ఫలాన్ని బట్టి వారు జ్ఞానజ్యోతిగా సమాజానికి ఉపయోగపడుతారు. 🌺 |